ఘోర రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై చెట్లకు నీళ్లు పోసే వాహనాన్ని వెనక నుండి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ ..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కనిష్క్ మృతితో తీగల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 19 ఏళ్ల కొడుకు చనిపోవడం పట్ల తల్లిదండ్రులు కన్నీటీపర్యంతమయ్యారు.

