కంటతడి పెట్టిన బర్రెలక్క..
తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష సంచలన వీడియో రిలీజ్ చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్‌పై కంటతడి పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తనపై ట్రోల్స్ వస్తున్నాయని, తన పెళ్లిపైనా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను ఏం తప్పు చేశాను’ అంటూ ప్రశ్నించింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని ఆమె పేర్కొంది.