Home Page SliderInternational

టీమిండియా సరికొత్త రికార్డు

టీమిండియా మరో ఘనత సాధించి రికార్డులకెక్కింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా కేవలం 12.2 ఓవర్లలోనే 100 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ,యశస్వి జైస్వాల్ కలిసి 98 పరుగులు చేశారు.ఆ తర్వాత రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. దీంతో గిల్ రంగంలోకి దిగి యశస్వి జైస్వాల్‌తో కలిసి 100 పరుగులు పూర్తి చేశారు. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. కాగా గతంలో శ్రీలంక vs బంగ్లాదేశ్‌కు జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌పై 13.2 ఓవర్లలో100 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. తాజాగా జరిగిన టీమిండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌లో ఇండియా ఆ రికార్డును బ్రేక్ చేసింది.