టీమ్ ఇండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌కు కళ్లు చెదిరే జీతం
టీమ్ ఇండియా కొత్త కోచ్‌గా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌ను ఎన్నిక చేసినట్లు తెలిసిందే. ఆయనకు ఆఫర్ చేసిన జీతభత్యాలు ఎంతో తెలిస్తే సామాన్యులకు కళ్లు చెదురుతాయి. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరించి, ఆ టీమ్‌ను ఐపీఎల్‌లో టైటిల్ గెలిపించారు. అందుకే టీమిండియా కోచ్ ద్రావిడ్ తర్వాత ఆయనను ఎంపిక చేశారు. ద్రావిడ్‌కు రూ.12 కోట్లు ఇవ్వగా, గంభీర్‌కు రూ.25 కోట్లు ఇవ్వజూపారని సోషల్ మీడియాలో టాక్. కేకేఆర్‌కు కోచ్‌గా కూడా ఆయనకు రూ. 25 కోట్లు లభించాయి. ఇదే కాకుండా డైలీ ఖర్చులు, విమానం చార్జీలు, ఎక్కడికి వెళ్లినా బస చార్జీలు కూడా బీసీసీఐ భరిస్తుంది.

