Home Page SliderInternationalSports

ఆసియా కప్‌లో అదరగొట్టిన టీమిండియా అమ్మాయిలు

ఆసియా కప్ క్రికెట్‌లో టీమిండియా మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లో బౌలర్లు బంగ్లా జట్టును కట్టడి చేసి, 8 వికెట్లు తీశారు. కేవలం 80 పరుగులు మాత్రమే ఇచ్చారు. జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా మాత్రమే 32 పరుగులు చేయగలిగారు. భారత్ బౌలర్లలో రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ మూడేసి వికెట్లు తీయగా, పూజా, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. దీనితో ఇప్పుడు భారత్ లక్ష్యం కేవలం 81 పరుగులు మాత్రమే.