చెన్నై చేరుకున్న టీమిండియా
ఇంగ్లండ్ తో రెండో టీ20 కోసం టీమిండియా చెన్నై చేరుకుంది. అక్కడికి చేరుకున్న టీమిండియాకు టీఎన్సీఏ అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి భారత జట్టు నేరుగా హోటల్ కు చేరుకుంది. కాగా, రేపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఐదు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం నాడు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం 1-0తో భారత జట్టు ముందంజలో ఉంది. అయితే.. శనివారం జరిగే రెండో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.

