Home Page SliderInternational

జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్

టీ 20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత జరగబోయే జింబాబ్వేతో ఐదు టీ 20 ల సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించే అవకాశం ఉంది. జట్టు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చి, యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.  ఈ టీ 20లో అవకాశం రాని యువ క్రికెటర్లను జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి, బుమ్రా, హార్దిక్, సూర్యకుమార్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీనితో జింబాబ్వే మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్‌ను భారత సారథిగా నియమించే అవకాశం ఉంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, అవేశ్ ఖాన్‌ ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శనలిచ్చిన అభిషేక్ శర్మ, నితీష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రాణా, రియాన్ పరాగ్‌లకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.