పొట్టి కప్పు ఫైనల్‌కు టీమిండియా..
అండర్ 19 వరల్డ్ కప్ టీ 20 మహిళాజట్టు ఫైనల్స్‌కు టీమిండియా దూసుకెళ్లింది. రెండవ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను కూడా 9 వికెట్ల తేడాతో మట్టి కరిపించి విజయం సాధించింది అమ్మాయిల టీమ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 113 పరుగులు చేసింది. భారత్ టీమ్ 15 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి అదరగొట్టింది. ఓపెనర్లు కమలిని 56 పరుగులు, గొంగడి త్రిష 35 పరుగులతో రాణించారు. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్స్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది.