టీమిండియా @ ధర్మశాల
వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా నిన్న బంగ్లాదేశ్‌తో తలపడిన ఇండియా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత మ్యాచ్ కోసం టీమిండియా ప్రస్తుతం ధర్మశాలకు చేరుకుంది. ఈ మేరకు గగ్గల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న భారత ప్లేయర్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. కాగా ధర్మశాలలో ఈ నెల 22న జరగబోయే మ్యాచ్‌లో ఇండియా vs న్యూజిలాండ్ జట్టులు తలపడనున్నాయి. అయితే నిన్న జరిగిన టీమిండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు స్కానింగ్ చేయిస్తున్నామని BCCI తెలిపింది.ఈ గాయం కారణంగా పాండ్యా నడవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారని కూడా వెల్లడించింది.ఈ నేపథ్యంలో పాండ్యా ఈ నెల 22న జరగబోయే మ్యాచ్‌లో ఆడతారా లేదా అన్న దానిపై సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో పాండ్యా ఇవాళ జట్టు సభ్యులతో ధర్మశాలకు చేరుకోలేదు. అయితే అతడు పూణే నుంచి నేరుగా బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

