396 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ సాధించినప్పటికీ కొద్ది సేపటికే వెనుదిరిగాడు. టైలెండర్లు తొందరిగా అవుటైపోవడంతో భారత్ జట్టు 396 పరుగులు మాత్రమే చేయగలిగింది. 336/6 వద్ద 2వ రోజును పునఃప్రారంభించి, జైస్వాల్, అశ్విన్ ఆటను ప్రారంభించారు, అయితే తరువాతి గంటల్లో అందరూ ఔటయ్యారు. జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. అయితే 209 పరుగుల వద్ద జేమ్స్ ఆండర్సన్ అవుట్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 179*, రవిచంద్రన్ అశ్విన్ 5* పరుగులతో భారత్ 336/6 వద్ద ఉండగా ఇవాళ 60 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు ఇండియా చేజార్చుకుంది.