Andhra PradeshHome Page Slider

విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులకే ఇది అవసరం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామ్మోహన్ సరికొత్త ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందమైన చేతిరాత ఆవశ్యకతను విద్యార్థులు తెలుసుకునేలా చేయాలని సరికొత్తగా ఆలోచించారు ఆయన. అందుకే ఈ విషయంలో కాలిగ్రఫీపై విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకే ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు కాలిగ్రఫీపై శిక్షణ ఇస్తే వారు మరెందరో విద్యార్థులకు శిక్షణనిచ్చి మంచి మార్కులు సాధించేలా చూస్తారని ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చేతిరాత చాలా నిర్లక్ష్యానికి గురయ్యిందని భావించి గుంటూరులోని ప్రభుత్వ పాఠశాలల  విద్యార్థులకు కాలీగ్రఫీపై శిక్షణ ఇవ్వాలని వారిని మెరుగ్గా తీర్చిదిద్దాలని భావించారు. అయితే తాను లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కష్టమని భావించారు. అందుకే టీచర్లకే శిక్షణ ఇస్తే వారు జీవితకాలం పాటు అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దుతారని భావించారు. సెలవు దినాలలో ఏపీలో జిల్లాల వ్యాప్తంగా ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. అన్ని వసతులను ఏర్పాటు చేసి, ప్రభుత్వ టీచర్లకు ఉచితశిక్షణ ఇస్తున్నారు. దీనితో ఉపాధ్యాయులు కూడా సంతోషంగా కాలిగ్రఫీని నేర్చుకుని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 4 వేల మంది ఉపాధ్యాయులకు, 40 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.