NewsTelangana

టీచర్ సస్పెండ్ .. రూ.4.35 లక్షల రికవరీకి కలెక్టర్‌ ఆదేశం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోక్యతండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు శ్రీనివాస స్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శశాంక మౌఖికంగా ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని లోక్య తండాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్‌ ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించారు. పర్యవేక్షణ మరియు రిజిస్టర్‌లో విద్యార్థుల హాజరు శాతం తదితర వివరాలను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌ నుంచి కలెక్టర్ సేకరించారు. అయితే.. పర్యవేక్షణలో, రిజిస్టర్ లో విద్యార్థుల హాజరు శాతం, తరగతి వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో సరైన సమాధానం చెప్పకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా విడుదలైన రూ.4.35 లక్షలతో పనులను సక్రమంగా చేయకపోవడంతో రికవరీ చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.