Andhra PradeshHome Page Slider

హైకోర్టు తీర్పుతో కంగుతున్న టీడీపీ నేతలు, కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు

30 రోజులుగా రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు

తెలుగుదేశం పార్టీకి సోమవారం అత్యంత కీలకంగా మారింది. దాదాపుగా సోమవారాన్ని ఆ పార్టీ జడ్జిమెంట్ డే గా భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించిన అన్ని కేసుల్లో తీర్పులతోపాటు విచారణ జరగనున్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్న ఉత్కంఠ పార్టీ నేతలు శ్రేణుల్లో నెలకొంది. స్కిల్ కేసులో ఇప్పటికే అరెస్టై గడిచిన నెల రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు స్కిల్ కేసు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులలో రోజుకు ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపిన సిఐడి ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ కేసుల్లో ఆయన పేరును చేర్చింది. ఇంకొకవైపు అంగళ్లు ఘర్షణలు లో కూడా చంద్రబాబుపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు.

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనే స్వయంగా తన వాదనలు వినిపిస్తూ కేసులు కొట్టేయాలని ఏసీబీ హైకోర్టును ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు బెయిల్ పిటిషన్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఒకవైపు ప్రభుత్వం తరఫున వాదనలు మరోవైపు చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్లకు సంబంధించిన తీర్పును కూడా సోమవారం ఏసీబీ కోర్టు వెలువరించనుంది. న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశా భావంలో ఆ పార్టీ నేతలు శ్రేణులు ఉన్నారు.