Andhra PradeshHome Page Slider

రాజమండ్రి కేంద్ర కారాగారానికి టీడీపీ నేత పట్టాభి

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు గన్నవరం సబ్ జైలు నుంచి న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తరలించారు. గన్నవరం దాడి తర్వాత పరిణామాలతో అరెస్ట్ అయిన 10 మందిని పోలీసులు తమకు అప్పగించినట్టు రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, పట్టాభి చేతికి తగిలిన గాయాలు స్వల్పమైనవేనని నిర్ధారించుకున్న తర్వాత ఆయనను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పట్టాభికి తగిలిన గాయాలు 24 గంటల ముందువేనని భావించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం తర్వాత జరిగిన ఘటనల్లో పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు.