ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామపంచాయతీ సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్, భార్య బ్రహ్మణీ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

