కాకినాడలో టీడీపీ-జనసేన ప్రతినిధుల వివాదం
ఎంతగా హైకమాండ్ నచ్చజెప్తున్నా కొన్ని చోట్ల టీడీపీ, జనసేన ప్రతినిధుల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా కాకినాడలో తీవ్ర స్థాయిలో ఉన్నాయి. బ్రాందీషాపులు, సచివాలయాలు, కీలకమైన పోస్టింగుల విషయాలలో నిత్యం గొడవలు, ఆధిపత్యం కోసం పోరాటాలు తప్పట్లేదు. తాజాగా దీపావళి సమీపిస్తుండడంతో బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో గొడవలు మొదలయ్యాయి. అక్కడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్గానికి, సిటీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులకు గొడవలు జరుగుతున్నాయి. దీనితో కొండబాబు అనుచరులు రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసనలు తెలియజేశారు. కాకినాడ నుండి రాజమండ్రి వెళ్తున్న నాన్‌స్టాప్ బస్సును కాసేపు టీడీపీ వర్గాలు అడ్డగించాయి. ఈ వివాదంపై పార్టీ పెద్దలు సీరియస్ అవుతున్నట్లు సమాచారం.

