ఏపీలో ఇంగ్లీషు మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదు:టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలల్లో డ్రాపౌట్లు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వ విధానాల కారణంగానే ప్రభుత్వ స్కూళ్లల్లో 8.31 లక్షలమంది విద్యార్థుల డ్రాపౌట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియంను సాకుగా చూపుతున్నారన్నారు. ఇది ఏపీ విద్యార్థుల మేలు కోసం కానే కాదని టీడీపీ ఎమ్మెల్సీ విమర్శించారు. అయితే టీడీపీ పార్టీ ఏపీలో ఇంగ్లీషు మీడియానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులపై బలవంతపు విద్యా విధానం వద్దనేది తమ డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా కేవలం ఇంగ్లీషు మీడియంతోనే విద్యార్థుల జీవితాల్లో వెలుగులు రావని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

