Andhra PradeshHome Page Slider

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్

వైసీపీ సర్కారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుకున్నంత పని చేసింది. గత కొద్దిరోజులుగా తనను… రేపో, ఎల్లుండో అరెస్ట్ చేస్తారని చెప్పినట్లుగానే పోలీసులు ఇవాళ చంద్రబాబునాయుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలు… విజయవాడ వచ్చిన తర్వాత చెప్తామని పోలీసులు చెప్తుండగా ఇప్పుడే చెప్పాలని చంద్రబాబునాయుడు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

అసలు కేసులో తన పేరు ఎక్కడ ఉందో చెప్పాలంటే పోలీసులను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. చుట్టూ ముట్టి బెదిరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడిగా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల ఐటీ శాఖ నోటీసుల ఆధారంగా కూడా చంద్రబాబును విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.