Andhra PradeshHome Page Slider

ట్యాక్సీ అపహరణ.. ఈడ్చుకెళ్లడంతో డ్రైవర్ మృతి

దేశ రాజధాని ఢిల్లీలో కారుని అపహరించిన కొందరు దుండగులు పారిపోయే క్రమంలో డ్రైవర్‌ను ఢీకొట్టి.. అతడిని దాదాపు 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. వసంత్ కుంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బిజేందర్ షా (43) సొంతకారును ట్యాక్సీగా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి కారులో ఒంటరిగా వెళుతున్న అతడిపై గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారు. బిజేందర్‌ను బయటకు లాగి కారుతో సహా పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవాలని చూసిన బిజేందర్‌ను ఢీకొట్టగా.. అతడు కారు కింద పడిపోయాడు. దుండగులు కారు వేగాన్ని పెంచి అతణ్ణి కొంతదారం అలాగే ఈడ్చుకుంటూ వెళ్లారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దుండగులపై హత్య కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ డీసీపీ మనోజ్ తెలిపారు. కాగా, నిందితులు ఇద్దరినీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.