Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

భవిష్యత్తులో కూడా పన్నుల తగ్గింపు

ప్రధాని మోదీ దేశ స్వయంసమృద్ధిలో ముందడుగు వేస్తోందని భారత ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. దేశం కోసం భవిష్యత్తులో కూడా పన్నుల తగ్గింపు కొనసాగుతుందన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని గౌతమ్‌ బుద్ధానగర్‌ లో మొదలైన ఇంటర్నేషనల్ ట్రేడ్‌ షోలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భారత్‌ లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లలో 55 శాతం యూపీ నుండే వస్తున్నాయన్నారు. సెమీకండక్టర్‌ రంగంలోను భారత్‌ స్వయంసమృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్‌లోనే చిప్‌ నుంచి షిప్‌ వరకు అన్నీ తయారుచేయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని మన దళాలు భావిస్తున్నాయి. మనం బలమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాం. రష్యా సాయంతో యూపీలో ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్‌ ఉత్పత్తి మొదలుపెడతాము. యూపీలో డిఫెన్స్‌ కారిడార్‌ ను నిర్మిస్తున్నారు. జీఎస్టీలో మార్పులు నిర్మాణాత్మక సంస్కరణలు. అవి భారత వృద్ధికి రెక్కలు తొడుగుతాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ సరళంగా మారింది. పన్ను వివాదాలు గణనీయంగా తగ్గాయి. ఎంఎస్‌ఎంఈలకు వేగంగా రీఫండ్స్‌ లభిస్తున్నాయి. మేము ప్రజల ఆదాయం, పొదుపు పెంచాము. మన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తాం. మరింతగా పన్నుల నుండి ప్రజలకు ఊరట లభిస్తుంది అంటూ ప్రధాని హామీ ఇచ్చారు.