NationalNews Alert

టాటా టియాగో ఎలక్ట్రిక్‌ కార్‌ బుకింగ్‌ ప్రారంభం

టాటా మోటార్స్ చౌకైన ఎలక్ట్రిక్ కారు టియాగో ఎలక్ట్రిక్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఏదైనా టాటా మోటార్స్ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌లో రూ.21,000 టోకెన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. జనవరి 2023 నుండి కారు డెలివరీలు ప్రారంభమవుతాయి. 5 రంగుల్లో టాటా టియాగో కారు లభ్యమవుతుంది. టాటా టియాగో కారు ప్రారంభ ధర రూ.8.49 లక్షలుగా ఉంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిమీల రేంజ్‌ను పొందుతుంది. డిసి ఫాస్ట్ చార్జర్‌తో టియాగో బ్యాటరీని 80% చార్జ్ చేయడానికి 57 నిమిషాలు పడుతుందని టాటామోటార్స్ తెలిపింది.