తాటాకు చప్పుళ్లకు భయ పడేది లేదు..
కేటీఆర్ పంపిన లీగన్ నోటీసులకు భయపడేది లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయ పడేది లేదని, తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు బండి సంజయ్. తొలుత తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది కేటీఆరేనని అందుకు బదులుగానే తాను మాట్లాడానని పేర్కొన్నారు. కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో ఆయన బాగోతం అంతా ప్రజలకు తెలుసని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసన్నారు. ఇప్పటివరకు మాటకు మాటతోనే బదులిచ్చానని, లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తానని, కాచుకోవాలని బండి స్పష్టం చేశారు.