బెంగళూరులో తారకరత్నకు చికిత్స
బెంగళూరు నారాయణ హృదయాలయంలో నందమూరి తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆయనను రాత్రి బెంగళూరుకు తరలించారు. డాక్టర్ ఉదయ్ నేతృత్వంలోని బృందం ఐసీయూలో చికిత్స అందిస్తోంది. రాత్రి వైద్యులు తారకరత్నకు మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. 48 గంటలపాటు తారకరత్నకు ఎక్మోపై చికిత్స అందించాలని వైద్యులు సూచించారు. తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తారకరత్న హెల్త్ బులిటెన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
