బెంగళూరుకు తారకరత్న తరలింపు
లోకేశ్ యువగళంలో పాల్గొనేందుకు కుప్పం వచ్చిన నందమూరి తారకరత్న అకస్మాత్తుగా కుప్పకూలారు. ఒక్కసారిగా ఆయన అపస్మారకస్థితికి గురయ్యారు. ఒక్కసారి తారకరత్న మాసివ్ హార్ట్ అటాక్‌కు గురయ్యారన్నారు బాలకృష్ణ. ప్రస్తుతం కోలుకుంటున్నారన్నారు. తారకరత్న గుండెలో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయన్నారు. ఐతే బీపీ నార్మల్‌గా ఉందన్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నామన్నారు. గుండె కుడి, ఎడమ రక్తనాళాలు బ్లాక్ అయ్యాయన్నారు. భగవంతుడి ఆశీస్సులతో కోలుకుంటున్నారన్నారు. అభిమానుల అండ శ్రీరామరక్ష అన్నారు.

