తమిళనాడులో ‘తండేల్’ సీన్ రిపీట్..
నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా సీన్ తమిళనాడులో రిపీటైంది. రామేశ్వరం, తంగచిమడం ప్రాంతాలకు చెందిన 27 మంది మత్స్య కారులు అంతర్జాతీయ సరిహద్దు రేఖ దాటారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. దీంతో రామేశ్వరం ఫిషింగ్ హార్బర్ లో 700 మంది మత్స్య కారులు తమ కార్యకలాపాలను నిలిపి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి చేరవేయడంతో సంప్రదింపుల తర్వాత 27 మందిని రిలీజ్ చేశారు.