తమిళిసై అరెస్టు..
తమిళనాడులో భాషా విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం, ఇతర స్థానిక పార్టీలు ఉద్యమిస్తుండగా, బీజేపీ మద్దతు పలుకుతోంది. తాజాగా బీజేపీ పార్టీ ఈ విధానానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో అక్కడ బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. బీజేపీ నాయకురాలు, మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసైని కూడా పోలీసులు అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. త్రిభాషా విధానంపై ప్రచారం, అవగాహన, ఈ సంతకాల సేకరణ ద్వారా ప్రజల మద్దతును సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ పార్టీ. తమిళ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పనితీరుపై ఉద్యమిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు.

