తెలుగులోకి రాబోతున్న తమిళ సూపర్‌హిట్ సినిమా
తమిళ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్,కీర్తి సురేష్ జంటగా..మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “మామన్నన్”.గత నెల29న తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఈ సినిమాలో వడివేలు,ఫహాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే తమిళనాడులో రూ.52 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేస్తే బాగుంటుందని తెలుగు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను సురేష్ ప్రొడక్షన్స్ ,ఏషియన్ సినిమాస్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. కాగా ఈ సినిమాని తెలుగులో నాయకుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించాయి.మరి తమిళనాడులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

