Home Page SliderNational

తమిళనాడు కల్తీ సారా కాటుతో పెరుగుతున్న మృతులు- 10 లక్షల పరిహారం

తమిళనాడులో కల్తీసారా వల్ల చనిపోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనితో తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల వంతున పరిహారం ప్రకటించారు. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో ఈ నాటు సారా కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. 90 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా, వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే 34 మంది మరణించారు. దీనితో సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీఐడీకి అప్పగించారు. కల్లకురిచి జిల్లా కలెక్టరును బదలీ చేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్ చేశారు. మరో పక్క ముఖ్యమంత్రి అలసత్వం వల్లే కల్తీ సారా కేసులు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. తగిన చర్యలు చేపట్టలేదని విమర్శిస్తున్నారు.