Home Page SliderNational

 టమాటాల ధరపై తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో దేశంలోని సామాన్య,మధ్య తరగతి ప్రజలు టమాటాలు కొనాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ రేషన్ షాపుల్లో టమాటాలు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడులో ఇప్పటికే కిలో టమాటా ధర రూ.150కి చేరింది. అయితే రేపటి నుంచే రేషన్ షాపుల్లో టమాటాలు విక్రయించాలని సీఎం స్టాలిన్ అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు  రేషన్ షాపుల్లో రేపటి నుంచి కిలో టమాటా రూ.60లకే అందించనున్నట్లు తమిళనాడు సర్కారు తాజాగా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర ఒక్కసారిగా రూ.150కి చేరింది.  కాగా దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో టమాటా పంట దిగుబడి తగ్గడంతో.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  టమాటాల కొరత ఏర్పడింది. దీని కారణంగానే దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి.