గిబ్లీ యాప్‌పై తమిళనాడు సర్కార్ హెచ్చరిక
ప్రస్తుతం గిబ్లీ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖుల ఫోటోలతో పాటు తమ కుటుంబ సభ్యుల ఫోటోలు, తమ ఫోటోలు కూడా చాలామంది గిబ్లీలో చూసుకుని మురిసిపోతున్నారు. అయితే ఈ యాప్‌పై కొంత ఆందోళన నెలకొంది. కృత్రిమ మేథ ద్వారా పనిచేసే ఈ యాప్‌కు మన ఫోటోలు పంపించామంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. సైబర్ క్రైమ్ నుండి హెచ్చరికలు రావడంతో ప్రజలకు కొన్ని మార్గదర్శకాలతో ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌ను అపరిచిత లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచించింది. దీనివల్ల ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు ఏఐకి అప్పగించడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు.

