Home Page SliderNational

కేరళకు తమిళనాడు ప్రభుత్వం సాయం

కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రకృతి విపత్తుతో వయనాడ్‌లో 43 మంది మృతి చెందారు.అయితే మరో 70మందికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేరళకు తమిళనాడు సీఎం స్టాలిన్ రూ.5కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాకుండా సీఎం స్టాలిన్ వయనాడ్‌లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.