Home Page SliderNational

రోజాకు ఫోన్ చేసి, ఆరోగ్యంపై ఆరా తీసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

ఏపీ మంత్రి రోజా కొన్నిరోజుల కింద వెన్నెముక, కాలు నొప్పితో అస్వస్థతకు గురై చెన్నై ఆసుపత్రిలో చేరారు. అయితే తనకు సీఎం స్టాలిన్ ఫోన్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని  రోజా వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనకు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. ఆయన మానవీయ స్పందనకు ముగ్ధురాలినయ్యానని రోజా తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని కూడా సలహా ఇచ్చారని వివరించారు. గతంలో తాను కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యతోనే బాధపడినట్టు సీఎం స్టాలిన్ వెల్లడించారని, ఆ సమస్యను ఎలా అధిగమించారో కూడా ఆయన చెప్పారని పేర్కొన్నారు.. నా ఆరోగ్యం పట్ల ఆయన చూపిన శ్రద్ధ, ప్రతి ఒక్కరి పట్ల ఆయన చూపించే ఆపేక్ష ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన గొప్ప పాలకుడే కాదు, ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకునే మనసున్న మనిషి కూడా. థాంక్యూ వెరీమచ్ సర్” అంటూ రోజా ట్వీట్ చేశారు…

Read more: 9 ఏళ్ల మోదీ పాలనపై కిషన్ రెడ్డి “రిపోర్టు టు పీపుల్” ప్రెజెంటేషన్