ఓటీటీలో అదరగొడుతున్న తమిళ సినిమా
తమిళ్ డైరక్టర్ మారి సెల్వరాజ్ దర్శత్వంలో తెరకెక్కిన “మామన్నన్” సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సినిమాని తెలుగులో “నాయకుడు” పేరుతో విడుదల చేశారు. అయితే తెలుగులో ఈ సినిమా ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. కాగా ఇటీవల మామన్నన్ సినిమా ప్రముఖ ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్)లో విడుదలై అదరగొడుతుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై 10 రోజుల నుంచి ఇండియాలో ట్రెండింగ్ నెం.1లో దూసుకుపోతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ట్రెండింగ్ నెం.9లో కొనసాగుతోంది.కాగా ఈ సినిమాని వారం రోజుల్లోనే 1.2 మిలియన్ల మంది వీక్షించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ప్రస్తుత సమాజంలో ఉన్న కుల రాజకీయాలపై విమర్శనాత్మకంగా “మామన్నన్” సినిమా రూపొందింది.అయితే ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్,వడివేలు,ఫాహద్ ఫాజిల్,కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో వారి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.