పెళ్లి పై తమన్నాఆసక్తికర వ్యాఖ్యలు
మిల్కీ బ్యూటీగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ పేరు తెచ్చుకున్న తమన్నాకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆమె ఇటీవల నటించిన ‘బబ్లీ బౌన్సర్’ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే తాజాగా ఆమె పెళ్లి , పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ నేను పెళ్లికి వ్యతరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాల బిజీలో పడి వాటి గురించి ఆలోచించ లేదు అంతే. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. సినిమా అవకాశాలు తగ్గడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే 2005లో హింది చలన చిత్రం చాంద్ సా రోషన్ చోహ్రాలో తొలిసారిగా తమన్నా నటించింది. అదే సంవత్సరం శ్రీ అనే చిత్రంతో తెలుగుచిత్ర పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుండి తెలుగు , తమిళం , హిందీ చిత్రాలలో నటించింది. ఇప్పటివరకు ఈ మూడు భాషల్లో 65 సినిమాల్లో నటించింది. బహుబలి లాంటి ప్యాన్ ఇండియా చిత్రంలోనూ ప్రధాన పాత్ర పోషించింది.