Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsPoliticsviral

అఫ్గాన్‌-పాక్‌ ఘర్షణల్లో 58 మంది పాక్‌ సైనికులు హతమన్న తాలిబన్‌

అఫ్గానిస్థాన్‌–పాకిస్థాన్‌ సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణల్లో పాక్‌ సైన్యంలో 58 మంది సైనికులు హతమైనట్లు తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు.

సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు తగిన బదులిచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో 25 పాక్‌ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశామని తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయి.

అలాగే, ఐసిస్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. మరోవైపు, పాక్‌ ప్రభుత్వం కాబూల్‌లోని ఓ మార్కెట్‌పై బాంబు దాడి జరిపిందని తాలిబన్‌ ఆరోపించింది.

అయితే, ఈ ఆరోపణలపై పాకిస్థాన్‌ అధికారిక ధ్రువీకరణ ఇంకా రాలేదు.