Home Page SliderNational

వానాకాలం దగ్గు తగ్గాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

బ్యాక్టీరియా, వైరస్ కారణంగా గొంతు నొప్పి, దగ్గు, ముక్కుకారడం, సైనస్ ఇబ్బంది ఉంటాయి. వానలు పడుతున్నాయంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాల కారణంగా వాతావరణంలో చేరుకునే తేమ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. బ్యాక్టీరియా, వైరస్ కారణంగా గొంతు నొప్పి, దగ్గు, ముక్కుకారడం, సైనస్ ఇబ్బంది ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. ఈ ఇబ్బందిని మనం రోజువారి తీసుకునే ఆహారాలతో తగ్గించుకోవచ్చు. అవేమిటంటే..

వానలో తడిస్తే జలుబు చేస్తుంది. ఎక్కువ సమయం అలాగే ఉంటే రోగనిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా పొడి బట్టలు వేసుకోవడం, వెచ్చని వాతావరణంలో ఉండటం, వేడి పదార్థాలను మాత్రమే తీసుకోవడం చేయాలి. వైరస్ బారిన పడకుండా ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. పరిసరాల శుభ్రతను పాటించాలి. గోరు వెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షం నీటిని నిల్వ ఉండనీయకుండా చూడాలి. దోమల సమస్యను తగ్గించాలి.