Andhra PradeshHome Page Slider

 “వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి”:ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెంకటగిరి నుంచి తనకు వచ్చిన ఆర్జీపై స్పందించారు. కాగా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీలో విద్యార్థినులు,యువతులు,మహిళలను కొందరు యువకులు వేధిస్తున్నారు.బైకులపై సంచరిస్తూ భయపెడుతున్నారు.అంతేకాకుండా యువతుల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మద్యం తాగి మా ఇళ్లపై రాళ్లు వేస్తున్నారు అని కొందరు మహిళలు,వృద్ధులు  పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ ఆకృత్యాలకు పాల్పడేవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు.