Home Page SliderNational

రెమ్యూనరేషన్‌ వ్యత్యాసంపై ట‌బు తీవ్ర ఆవేదన

బాలీవుడ్ అగ్ర న‌టులు అజయ్‌ దేవగణ్‌, టబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘ఔర్‌ మే కహా దమ్‌ థా’. ఈ సినిమాకు నీరజ్‌ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ట‌బు పారితోషికం వ్యత్యాసాలపై గ‌ట్టిగా స్పందించింది.

ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఒక రిపోర్ట‌ర్ ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడుగుతాడు. దీనిపై స్పందించిన ట‌బు ప్ర‌తిసారీ ఈ ప్ర‌శ్న‌ హీరోయిన్‌ల‌ను మాత్రామే ఎందుకు అడుగుతారు. నిర్మాతల‌ను అడ‌గ‌వ‌చ్చు క‌దా! అలాగే మీకు మాత్ర‌మే ఎందుకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటూ హీరోల‌ను కూడా అడగవచ్చు కదా? ఇలా మీరు అడిగితే ఇలాంటి విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి అని టబు తెలిపారు.

రీసెంట్‌గా బాలీవుడ్‌లో క్రూ అనే సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ భామ‌. క‌రీనా క‌పూర్, ట‌బు, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌రోవైపు ఇప్ప‌టికే అజ‌య్‌తో క‌లిసి ట‌బు హిందీ ‘దృశ్యం’తో పాటు దే దే ప్యార్ దే సినిమాలో న‌టించారు. ఇక ‘ఔర్‌ మే కహా దమ్‌ థా’ చిత్రంలో వీరి కాంబో రిపీట్ అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక క‌థ విషయానికి వ‌స్తే.. చిన్న వయసు నుంచే ఇష్టాన్ని పెంచుకున్న కృష్ణ (అజ‌య్), వసుధ (ట‌బు)లు ఒక‌రంటే ఒక‌రికి ప్రాణంగా ఉండి ఎందుకు విడిపోయారో అర్థం కాదు? మళ్లీ తిరిగి కలిశారా? లేదా? విడిపోయిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.