టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. భారీ హిట్టర్లతో కూడిన పటిష్టమైన ఇంగ్లాండ్‌కు పసికూన ఐర్లాండ్ గట్టి షాకిచ్చింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లకు 157 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్… 14.3 ఓవర్లకు 105/5 స్కోరుతో నిలిచింది. మొయిన్ అలీ 24 పరుగులతో, లియామ్ లివింగ్‌స్టోన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ దశలో వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో దీంత్ డర్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగులతో విజయం సాధించినట్లు అంఫైర్లు ప్రకటించారు. దీంతో ఐర్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.