Breaking Newshome page sliderHome Page SliderNationalSports

టీ20 వరల్డ్‌ కప్-2026 షెడ్యూల్ విడుదల

ఇండియా, శ్రీలంకలో ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న ICC పురుషుల టీ20 వరల్డ్‌ కప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ టోర్నీ మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. టోర్నీ కోసం రోహిత్ శర్మ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.

భారతంలో ఐదు వేదికలు… అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై –లో మ్యాచ్‌లు జరగనుండగా, శ్రీలంకలో మూడు వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయి: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, UAE, ఒమన్, వెస్టిండీస్, USA, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్.

ఒక్కో గ్రూప్‌లో ఐదు టీంలు ఉండగా, మొత్తం నాలుగు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీంలు సూపర్‌ 8కి అర్హత సాధిస్తాయి. గ్రూప్‌-ఏలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు ఉన్నాయి. భారత్‌-అమెరికా మ్యాచ్ ఫిబ్రవరి 7న, కోలంబోలో ఫిబ్రవరి 15న భారత్‌-పాక్‌ మ్యాచ్ జరుగనుంది.

ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం గ్లోబల్ ట్రోఫీ టూర్ డిసెంబర్ 1న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికగా ఏర్పాటు చేయనున్నారు. అయితే పాక్ ఫైనల్‌కు చేరినట్లయితే వేదిక మారవచ్చని ఐసీసీ స్పష్టం చేసింది. ఈసారి టీ20 వరల్డ్‌ కప్ 2026 వేదికలు, గ్రూప్ లు, మొదటి మ్యాచ్‌ల తేదీలు ఇప్పటికే ఖరారైనట్లుగా, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.