బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం బీసీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఈ రోజు ఉదయం క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆరాధ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయులు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చాయని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మా పాప ఉరివేసుకుందని చెప్తున్నారంటూ తల్లిందండ్రులు ఆవేదన చెందారు. మా పాప ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవు. ఉపాధ్యాయులు అబద్ధం చెప్తున్నారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. మృతదేహం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతావు అంటూ ఉపాధ్యాయులు అనడంతో అవమాన భారంతో చనిపోయిందని సమాచారం.