రాష్ట్రపతి భవన్‌లో అనుమానాస్పద జంతువు కలకలం
రాష్ట్రపతి భవన్‌లో నిన్న 3వ సారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎంతోమంది దేశ,విదేశీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అనుమానాస్పద జంతువు సంచారం చేయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అయితే ఆ జంతువుకు చిరుత ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మంత్రుల ప్రమాణ స్వీకారంలో కనిపించిన జంతువు ఏంటి అన్న దానిపై రకరకాల ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ఘటనపై రాష్ట్రపతి భవన్ వర్గాలు ఇప్పటిదాకా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.