Andhra PradeshHome Page Slider

లైంగిక ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్..

టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌కు గురయ్యారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను వేధించారని మహిళా కార్యకర్త నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ వేధింపులను తట్టుకోలేక భర్త సూచనలతో ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సీరియస్ అయిన అధిష్టానం పార్టీ నుండి ఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది. ఈయన వైసీపీ నుండి ఎన్నికల ముందు టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.