నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్నదొకటి.. అయ్యిందొకటన్న బాధలో ఉన్న వైసీపీ.. ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాక సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. ఒక్కో ఎమ్మెల్యేను 10 నుంచి 15 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. ఇలాంటి చర్యలతో పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. విశ్వాసం లేనివారు, పార్టీలో ఉండటం అనవసరం లేదన్నారు. అందుకే నలుగురిని పార్టీలోంచి తొలగించామన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో బయటకు వెళ్లలేదని.. ప్రలోభాలకు లొంగి వెళ్లారంటూ ధ్వజమెత్తారు. అయితే వైసీపీకి మద్దతిచ్చిన… టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుపై అసంతృప్తితోనే వైసీపీకి జైకొట్టారంటూ తనదైన భాష్యం చెప్పారు సజ్జల.

