డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్
ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన ఈ తరుణంలో డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ నేటి ఉదయం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను అభినందించారు. ఇదే ఈ చర్యకు కారణమయ్యింది. సంజయ్ కుమార్ జైన్, మహేష్ భగవత్‌లు కూడా ఆయనతో వెళ్లారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చర్యలలో భాగంగా ఎలక్షన్ కమీషన్ ఈ చర్యలు తీసుకుంది. అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ, సంజయ్ కుమార్ జైన్, మహేష్ భగవత్‌ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఎలక్షన్ కమీషన్ పోలీసులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. అంజనీకుమార్ తర్వాత సీనియర్ ఆఫీసర్ డీజీపీగా తాత్కాలికంగా వ్యవహరించబోతున్నారు.

