Home Page SliderNational

లోక్‌సభ స్మోక్‌బాంబ్ ఘటనలో 8 మంది అధికారుల సస్పెన్షన్

బుధవారం జరిగిన లోక్‌సభ స్మోక్‌బాంబ్ ఘటనలో 8 మంది భద్రతా అధికారులపై  సస్పెన్షన్ వేటు పడింది. విజిటర్స్ స్మోక్ బాంబులతో లోక్‌సభలో ప్రవేశించడంలో వీరు నిర్లక్ష్యం వహించారని, సరైన తనిఖీలు నిర్వహించలేదని వారిపై ఆరోపణలు ఉన్నాయి. పాస్‌లు జారీ చేసే విషయంలో ఎంపీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్నటి ఘటనపై నేడు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ ఘటనపై ఎంక్వైరీ వేశామని, ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పార్లమెంట్ భద్రతా విషయాన్ని రాజకీయం చేయొద్దన్నారు. సభామర్యాదకు భంగం కలిగించొద్దని పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయా అనే విషయంపై కూడా విచారణలు జరుగుతున్నాయన్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్లేవారికి  పూర్తి స్కాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి కేవలం ఎంపీలకు మాత్రమే పార్లమెంట్‌లోకి ప్రవేశం ఉంటుందని, పాస్‌లపై మిగిలిన వారిని అనుమతించేదిలేదన్నారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, రాజీనామా చేయాలని కాంగ్రెస్ కూటమి ఆందోళన చేస్తున్నారు.