Home Page SliderNational

ఐపీఎల్‌ 2025పై ధోనీ సస్పెన్స్

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ నుండి ధోనీ మ్యాజిక్‌ను చూస్తామా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీనికి మహి అమెరికా నుండి వచ్చాక దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. అయితే అతడిని రిటైన్ చేసుకుంటామని సీఎస్‌కే ప్రకటించినట్లు పలు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా ధోనీ నుండి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదని, బీసీసీఐ కూడా అధికారికంగా రిటెన్షన్‌పై నిర్ణయం తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఇటీవలే అమెరికాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. తన స్నేహితులతో కలిసి వెకేషన్ పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. అతడు రాంచీ ఎయిర్ పోర్టులో ఉన్న వీడియోలు కూడా అభిమానులు పంచుకుంటున్నారు. సీఎస్‌కే తరపున మొదటినుండీ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్‌లో ఐపీఎల్ 2025 మెగావేలాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ధోనీ 2024లో మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడారు. గాయంతో బాధపడడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరిగా దిగిన సంగతి తెలిసిందే.