Home Page SliderNews

తనకు గుండెపోటు వచ్చిందన్న సుస్మితా సేన్

నాకు పెద్ద హృదయముందని డాక్టర్ చెప్పాడన్న సుస్మితా సేన్

సుస్మితా సేన్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీలో కొన్ని రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించింది. 47 ఏళ్ల నటి గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆరోగ్య సమాచారాన్ని పంచుకుంది. ఆమె తండ్రి సుబీర్ సేన్‌తో కలిసి ఒక చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇలా రాసింది. “మీ హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా ఉంచండి, మీకు అవసరమైనప్పుడు అది మీకు అండగా నిలుస్తుంది” రెండు రోజుల క్రితం గుండెపోటుతో బాధపడ్డాను… యాంజియోప్లాస్టీ చేశారు… స్టెంట్ అమర్చారు… ముఖ్యంగా, నా కార్డియాలజిస్ట్ ‘నాకు పెద్ద హృదయం ఉంది’ అని ధృవీకరించారు.” అని రాసుకొచ్చింది. ” వారి సమయానుకూలమైన సహాయానికి, నిర్మాణాత్మక చర్యకు కృతజ్ఞతలు మరో పోస్ట్‌లో చేస్తాను.” “ఈ పోస్ట్ కేవలం నా శ్రేయోభిలాషులు, ప్రియమైన వారికి తెలియజేయడం కోసమే. శుభవార్త …అంతా బాగానే ఉంది. నేను మళ్ళీ జీవితాన్ని ఆశ్వాదించేందుకు సిద్ధంగా ఉన్నాను. అందరికీ ప్రేమను పంచుతున్నాను. #దేవుడు గొప్పోడు #డుగ్గడుగ్గ.” అంటూ ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చారు.

సుస్మితా సేన్ బివి నంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యున్ కియా, తుమ్‌కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఇంటర్నేషనల్ ఎమ్మీ-నామినేట్ చేయబడిన ధారావాహిక ఆర్యతో నటనను పునరాగమనం చేసింది. త్వరలో సిరీస్ మూడవ సీజన్‌లో కనిపించనుంది. సుస్మితా సేన్, మాజీ మిస్ యూనివర్స్, కుమార్తె అలీసాకు ఒంటరి తల్లి. సుస్మిత 2000లో రెనీని దత్తత తీసుకుంది. అలీసా 2010లో కుటుంబంలో చేరింది. రెనీ ఒక షార్ట్ ఫిల్మ్‌తో నటనా రంగ ప్రవేశం చేసింది.