‘ఆ విషయంలో నాకు స్ఫూర్తి సూర్యనే’…రాజమౌళి
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కంగువ’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన చిత్ర హీరో సూర్య గురించి మాట్లాడారు. ఈ చిత్రం విజువల్స్, కంటెంట్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడకపోతే చాలా మిస్సవుతారన్నారు. పాన్ ఇండియా చిత్రాలు చేసేందుకు హీరో సూర్యని స్ఫూర్తిగా తీసుకున్నానని పేర్కొన్నారు. సూర్య నటించిన ‘గజినీ’ చిత్రాన్నే తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నానని తెలిపారు. ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడానికి సూర్య ఎంతో కష్టపడ్డారని, దానినే తాను కేస్ స్టడీగా తీసుకుని పాన్ ఇండియా చిత్రాలు తీయడం మొదలుపెట్టానని పేర్కొన్నారు. సూర్యతో సినిమా చేసే అవకాశాన్ని మిస్సయ్యానని, ఈ సారి అవకాశం వస్తే వదులుకోనని చెప్పారు. సూర్య మాట్లాడుతూ రాజమౌళిగారి ఏ చిత్రంతోనూ మా ‘కంగువ’ను పోల్చలేం అని, ఆయన చిత్రాన్ని మిస్ చేసుకున్నానని పేర్కొన్నారు.