ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్ నాగరాజు
ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటున్నరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు జక్కాపురం మల్లేశం తన వ్యవసాయ భూమి కొలతల పంచనామా ధ్రువీకరణ పత్రం కోసం సర్వేయర్ ను కలిశారు. అందుకోసం సర్వేయర్ రైతు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఇప్పటి కే రూ.22 వేలు సర్వేయర్ నాగరాజుకు ఇచ్చిన రైతు, ఇవాళ మరో రూ.15 వేలు చంద్రంపేట రైతు వేదిక వద్ద ఇస్తుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అనంతరం అతడిని ఎల్లారెడ్డిపేట తహసీల్దారు కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

